
Bad Roads.
గతుకుల రోడ్లతో ప్రయాణికుల ఇక్కట్లు
◆:- వర్షం పడితే గుంతల నిండా నీళ్ళే
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం ఎక్కడ చూసినా గతుకుల రోడ్లే ప్రయాణికులను ఎవరిని కదిపినా గుంతల రోడ్ల బాధలే ఎవరికి చెప్పినా పట్టింపు లేదాయే సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో నని వేచి చూడడమే తప్పా చేసేది ఏమిలేదన్నట్టుగా ఉంది ఝరాసంగం టు జీర్లపల్లి వయా పెద్దచెల్మడా రోడ్డు పరిస్థితి. ఎప్పుడో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో వేసిన బీటీ రోడ్డు నేటి వరకు మరమ్మత్తులు చేసింది. లేదు. దీంతో అడుగడుగునా గుంతలు పడి రోడు మొత్తం ఛిద్రమైంది. ఈ దారి గుండా కంకోల్, సంగా రెడ్డి వెళ్ళే వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు.మండల కేంద్రంలో ప్రసిద్ది చెందిన
కేతకీ సంగమేశ్వర ఆలయానికి శ్రావణ మాసంలో హైదరబాద్,సంగారెడ్డి,సదాశివపేట్లతో పాటు పరిసర గ్రామాల నుండి నిత్యం భక్తులు వస్తుంటారు. ఈ రోడ్డుపై వాహనాలు నడపడమంటే నరకమే అని ప్రయాణికులు వాపోతున్నారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రోడ్డుపై ఉన్న గుంతలు చెరువులను తలపిస్తు న్నాయి.గుంతలలో నీరు నిలువడంతో ప్రయాణికు లకు ప్రమాదం ఏర్పడే పరిస్థితి నెలకొన్నది. అధికా రులు,ప్రజా ప్రతినిధులు స్పందించి మరమ్మత్తులు చేయించాలని ప్రయాణికులు, వాహనదారులు, ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.