మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం..
పేద వృద్ధురాలి అంతక్రియలకు చేయూతనిచ్చిన
మానవసేవే మాధవసేవ గ్రూప్ సభ్యులు
మల్కాజిగిరి నేటిధాత్రి
మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని మీర్జాలగూడలో నివసిస్తున్న 70 సంవత్సరాల వృద్ధురాలు యాదమ్మ అనారోగ్యంతో శుక్రవారం పరమపదించారు. ఆమెకు ఎవరు లేకపోవడంతో అంతక్రియలు నిర్వహించడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది.
ఈ విషయం మీర్జాలగూడ కాలనీకి చెందిన బిక్షపతి మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన కుమ్మరి రాజు వృద్ధురాలి పరిస్థితిని గ్రూప్‌లో తెలియజేశారు. మానవతా దృక్పథంతో స్పందించిన గ్రూప్ సభ్యులు తమ వంతు సహకారం అందించారు.
మొత్తం 19 మంది గ్రూప్ సభ్యుల సహకారంతో రూ.10,305/-లు సేకరించి, యాదమ్మ అంతక్రియల ఖర్చుల నిమిత్తం కాలనీ వాసుడు బిక్షపతికి గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు అందజేశారు.
సకాలంలో స్పందించి, పేద వృద్ధురాలి అంతక్రియలకు ఆర్థిక సహాయం అందించిన మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కాలనీ వాసులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
