
తొర్రూర్ డివిజన్ నేటి ధాత్రి:
బీజేపీ ఆర్ఎస్ఎస్ లకు ఈ పోరాటంతో సంబంధంలేదు
సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూస్వాముల భూమికోసం భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిందని, తెలంగాణకు నిజమైన వారసులు కమ్యూనిస్టులే అని సిపిఎం పార్టీ మహబూబాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్ అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం తోరూర్ మండలంలో కంటయపాలెం గుర్తురు అమ్మపురం, గోపాలగిరి గ్రామాలలో అమరవీరుల స్తూపాల కు పుష్పాంజలి ఘటించి సిపిఎం పార్టీ తోరూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ వారోత్సవాలను ముగింపు సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్ సిపిఎం తోరూర్ మండల కార్యదర్శి ఎండి యాకుబ్ లు మాట్లాడుతూ, భూస్వాములు, రజాకార్ల వెట్టిచాకిరీ నీ ఎదిరించి సామాన్య ప్రజల్లో కమ్యూనిస్టు పార్టీ రగిలించిన చైతన్యం తో రైతులు నడిపిన నాటి పోరాటం చారిత్రాత్మకమైన దని అన్నారు. నాటి పోరాటం వల్ల 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులదని వారికి సందర్భంగా గుర్తు చేశారు. ఈ పోరాటం ద్వారా 3 వేల గ్రామ ల లో గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటయ్యాయి అని వారు తెలిపారు.ఆ పోరాటంలో,దొడ్డి కొమరయ్య షోయబుల్లాఖాన్, పి.సుందరయ్య,ముగ్ధుమ్ మోహిణుద్దీన్, మల్లు స్వరాజ్యం లాంటి వారు వీరోచిత పాత్ర పోషించారని గుర్తు చేశారు.ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా సామాజిక,కులవివక్ష కు వ్యతిరేకంగా ఆ పోరాటం నేర్పిన అనుభవాలతో నేటి ప్రజలు దేశ సంపదలో సమాన వాటా కొరకు కుల,మతాలకు అతీతంగా,కేంద్ర రాష్ట్ర పాలకులు ఇచ్చిన వాగ్దానాల అమలుకోసం పోరాడాలని సూచించారు. ఆనాటి పోరాటం తో ఏమాత్రం సంబంధం లేని నేటీ బిజేపీ, ఆర్ ఎస్ ఎస్ సంస్థలు ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా హిందువులు చేసిన పోరాటంగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 వతేదీ వరకు వాడవాడలా ఈ వాస్తవాలు చెప్పాలని,ఆనాటి సామాన్య ప్రజలు, కమ్యూనిస్టు పార్టీ చేసిన త్యాగాలను ఈ నాటి యువతకు తెలియజెప్పాలని కోరారు. నాటి పోరాట ఫలితంగానే తెలంగాణలో ఇప్పటికి అనేక ఉద్యమాలు కొనసాగుతున్నాయని అన్నారు కేంద్రంలో బిజెపి రాజకీయ ప్రయోజనాల కోసం నాటి చరిత్రను వక్రీకరిస్తూ రెండు సినిమాలు విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఎలక్షన్లలో ఓటర్లను దండుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 17 చరిత్రలో ఏం జరిగింది దాని ప్రాధాన్యత ఏమిటి ఎందుకు ఇంత వివాదాస్పదమవుతుందో ఇవన్నీ లోతుగా పరిశీలించాలని బిజెపి ఆర్ఎస్ఎస్ తప్పుడు ప్రచారాన్ని ఎండగడుతూనే సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 17 కు వారసులు కమ్యూనిస్టులేనని సాయుధ పోరాటం లక్ష్యాలు ఇంకా నెరవేరలేదని ఆ నెరవేర్చే బాధ్యత ఈ తరం పై ఉందని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ తోరూర్ మండల నాయకులు , డోనక దర్గయ్య, మర్కా సాంబయ్య, గుద్దేటి సాయిమల్లు, ఉమగాని యాకయ్య, కొత్త వెంకట్రెడ్డి శంకరాచారి, ధరావత్ యాకన్న, సతీష్, ప్రమీల, శైలజ, తదితరులు పాల్గొన్నారు.