· హైదరాబాద్‌లో ఒక్కసారిగా గహ వినియోగ గ్యాస్‌కు పెరిగిన డిమాండ్
· గ్యాస్ సరఫరా తగినంత లేక ీVAటల్ పరిశ్రమ లబోదిబో
· పెద్దమొత్తంలో చిన్న ీVAటళ్లు మూతపడే ప్రమాదం
· ఇప్పటికే గ్యాస్ ఎక్కువ అవసరమయ్యే వంటకాలను మెనూ నుంచి తొలగింపు
· గ్యాస్ అయిపోతే ీVAటళ్ల మూసివేత
· ీVAటల్ పరిశ్రమపై ఆధారపడే వేలాదిమంది ఉపాధికి గండం
· భయపడాల్సిన అవసరం లేదంటున్న ప్రభుత్వం
· క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నం
· వాణిజ్య సిలిండర్లకు కొరత
· గహ వినియోగానికి మరో 25`30 రోజుల వరకు ఢోకాలేదు
· రోజుకు 2.3లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నామంటున్న ప్రభుత్వం
హైదరాబాద్, నేటిధాత్రి:
గల్ఫ్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రస్తుతానికి దేశంలో పెట్రోల్ డీజిల్ ధరల్లో పెరుగుదల లేకపోవడం సామాన్యులకు వూరట కలిగిస్తున్న ప్పటికీ, యుద్ధం ఇదేమాదిరిగా కొనసాగితే పరిస్థితేంటన్నది అన్ని వర్గాల ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళన. ఇదే సమయంలో అనవసర భయాలను పెంచే రీతిలో అవాస్తవాలు ప్రచారం కావడం కూడా కద్దు. ఇది ప్రజల్లో మరింత భయాందోళనలకు కారణమై, ఇంధన ఉత్పత్తులపై అనవసర డిమండ్ పెరిగి అనూహ్యంగా ధరలు పెరిగే ప్రమాదముంది. అమెరికా`ఇజ్రాయిల్` ఇరాన్ యుద్ధం నేపథ్యంలో చమురు సరఫరాలు నిలిచిపోయాయన్న వార్తలు వస్తుండటం సామాన్యు లు ముందు జాగ్రత్త చర్యగా గ్యాస్ సిలిండర్లను వివపరీతంగా బుక్ చేసుకుంటుండటంతో ఒక్క సారి డిమాండ్ పెరిగిపోయింది. ఇప్పటికే గహవాడకాలకు ఉపయోగించే సిలిండర్ ధర రూ. 913కు, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే సిలిండర్ ధర రూ.115కు పెరగడంతో, ఇవి మ రింత పెరుగుతాయేమోనన్న ఆందోళన సామాన్యుల్లో వ్యక్తమవుతోంది. ఫలితంగా ఎవరికి వారు ముందుజాగ్రత్త చర్యగా సిలిండర్లను బుక్ చేసుకుంటుండటంతో వీటి డిమాండ్ 50% పెరిగిపోయింది. హైదరాబాద్‌లో ీVAటళ్లకు సరఫరా చేసే సిలిండర్ల సరఫరా సక్రమంగా లేకపోవడం తో చాలా ీVAటళ్లు తాత్కాలికంగా మూతపడి, వ్యాపారం దెబ్బతింటుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని ీVAటళ్లలో దోశ, గారె, వంటి నూనె వాడకం ఎక్కువగా వుండే టిఫిన్లను నిలిపేసినట్లు వస్తున్న వార్తలు మధ్యతరగతి వారి ఆందోళనను మరింత పెంచే స్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు బ్యారల్‌కు 110 డాలర్లకు చేరిన ప్రభావం వివిధ దేశాలపై ప్రభావం చూపడం మొదలైంది. ఫలితంగా అమెరికా సహా యూరప్ దేశాలు, ఆసియా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటడం మొదలైంది. విశేషమేమంటే హైదరాబాద్ నగరంలో ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగకుండా స్థిరం గా కొనసాగుతుంటడం కొంత వూరటనిస్తోంది. అయినప్పటికీ పెట్రో ‘బాంబు’ ఎప్పుడు పేలు తుందోనన్న భయం సామాన్యులను కునుకులేకుండా చేస్తోంది.
మధ్య ఆసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం వల్ల చమురు ధరలు పెరిగితే, ఆ ప్రభావాన్ని మొట్టమొదట చవిచూసేది ీVAటళ్లే! ప్రస్తుతం గ్యాస్ సరఫరాలకు ఆటంకం కలుగుతున్న నేప థ్యంలో కేంద్రం, వాణిజ్య అవసరాలకు గ్యాస్ వాడకంపై కొన్ని పరిమితులు విధించడం గమనార్హం. దీని ప్రభావం ముంబై, బెంగళూరు వంటి నగరాల్లోని ీVAటల్ పరిశ్రమపై పడింది. పది నుంచి ఇరవై శాతం వరకు ీVAటళ్లు మూతపడే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రం మొత్తం మీద 1.3 కోట్లమంది గ్యాస్ వినియోగదార్లునున్నారు. నెల వారీగా సగటున రాష్ట్ర వ్యాప్తంగా 58 లక్షలనుంచి 60 లక్షల వరకు సిలిండర్ బుకింగ్స్ జరుగుతాయి. చమురు ఉత్పత్తి చేసే కంపెనీలు ఈ డిమాండ్‌ను తట్టుకోవడానికి రోజువారీగా 2.3లక్షల సిలిండర్లను సరఫరా చేస్తున్నాయి. గత జనవరి నెలలో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన కింద 41.5 లక్షల కనెక్షన్లను పేద కుటుంబాలకు అందజేశారు. ఇక వాణిజ్య సిలిండర్ల విషయానికి వస్తే రాష్ట్రంలో 7.5లక్షల వాణిజ్య సిలిండర్ల వినియోగం జరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే 74వేల కంటే ఎక్కువ ీVAటళ్లు, రెస్టారెంట్లు వాణిజ్య సిలిండర్లను వినియోగిస్తు న్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన చిన్న, మధ్యతరహా ీVAటళ్లలో సగటు వాడకాన్ని పరిశీలిస్తే…30 మంది కస్టమర్ల సామర్థ్యమున్న ీVAటళ్లు సగటున నెలకు 25 సిలిండర్ల వరకు వాడతాయి. ఇక చిన్న పీజీ (హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్)ీVAటళ్లు వారానికి ఒక్క సిలిండర్ మాత్రమే వినియోగిస్తాయి. ఇక మధ్య తరహా ీVAటళ్లు రోజుకు 4 నుంచి 6 సిలిండర్ల వరకు వినియోగి స్తాయి. స్టార్ ీVAటళ్లలో రోజుకు10 నుంచి 20 సిలిండర్ల వరకు వినియోగం వుంటుంది. హైటెక్ సిటీ వంటి రద్దీ ప్రాంతాల్లో పెద్ద రెస్టారెంట్లు సగటున రోజుకు 15 సిలిండర్లు వినియోగిస్తున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయి. గతంలో పెద్ద ీVAటల్ గ్రూపులు సగటున రోజుకు 30 సిలిండర్ల వినియోగించేవి!
ఇప్పుడు మధ్య ఆసియాలో యుద్ధం ప్రభావం వల్ల ీVAటళ్లు 75శాతం వరకు గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవాల్సి వస్తున్నది. అంటే రోజుకు 15 సిలిండర్ల వాడకం జరిపే ీVAటళ్లకు ఇప్పుడు కేవలం 3 సిలిండర్లు మాత్రమే అందుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా ీVAటళ్లు గ్యాస్ పొదుపు కోసం, మెనూలోని కొన్ని అయిటంలను తగ్గించేస్తున్నాయి. గ్యాస్ కంపెనీలు ఇప్పుడు ఆసుపత్రులు, హాస్టళ్లకు, విద్యాసంస్థలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. ీVAటళ్లు, పరిశ్రమలకు గ్యాస్ సరఫరాలో 50% కోత విధించగా, ఎరువుల కర్మాగారాలకు 40% కోత విధింపు కొనసాగుతోంది. ఇక రెండు సిలిండర్లు కలిగిన గహ వినియోగదార్లు సిలిండర్ బుకింగ్‌కు 30 రోజుల వ్యవధి వుండాలన్న పరిమితిని విధించింది. ఇక ఒక సిలిండర్ వున్నవారు 21 రోజుల తర్వాత మాత్రమే బుకింగ్ చేసుకోవాలి. నెలలో గరిష్టంగా రెండు సిలిండర్లను మాత్రమే ఇస్తారు. ఇక వార్షికంగా 15 సిలిండర్లు మాత్రమే గహవినియోగదార్లు వినియోగించుకోవాలి. గ్యాస్ కనెక్షన్ దుర్వినియోగం కాకుండా వుండటానికి ఈకేవైసీతో పాటు సిలిండర్ సరఫరా సమయంలో ఓటీపీ తప్పనిసరి చేశారు.
గ్యాస్ సరఫరా దెబ్బకు కుదైలైన ీVAటల్ రంగం ఇప్పుడు ప్రత్యామ్నాయాలపై దష్టి సారిస్తోంది. దోశలు, ఇతర వంటకాలకోసం ఇండక్షన్ స్టౌల వాడకాన్ని మొదలుపెట్టాయి. ఇక అన్నం వండటానికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లను ఎంచుకుంటున్నాయి. ఇక బేకరీ ఐటమ్లు, గ్రిల్డ్ చికెన్ వంటి వాటికోసం ఎలక్ట్రిక్ గ్రిల్స్, కాంబి ఓవెన్లు వాడుతున్నాయి. కొన్ని ప్రత్యేక వంటకాలకు పాత పద్దతులనే అనుసరిస్తున్నారు. ముఖ్యంగా హలీమ్ వంటకం తయారీకి, ఇప్పటికీ 90% కట్టెల పొ య్యినే వాడుతుండటం గమనార్హం. అందువల్ల వీటిపై గ్యాస్ సరఫరా ప్రభావం వుండదనే చెప్పాలి. ఇక పెద్దఎత్తున వంట చేసేవారు డీజిల్ ఆధారిత బర్నర్లను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నా రు. సరఫరా లేని సమయాల్లో కొన్ని ీVAటళ్లు సిలిండర్లను రెట్టింపు ధరకు (రూ.3వేలు) కొనుగోలు చేస్తుండగా, గ్యాస్‌ను ఎక్కువగా వినియోగించే రవ్వదోసె, దోసె, పరోటా వంటి వంటకాలను మెనూ నుంచి కొన్ని ీVAటళ్లు తొలగిస్తున్నాయి. ఆర్డర్ లేని సమయంలో స్టౌవ్‌ను ఆన్‌లో వుంచకుండా నిలిపేస్తున్నారు. ఆవిధంగా స్టౌను ఆపకుండా వుంచే అలవాటునుంచి గ్యాస్ పొదు పు చర్యవైపునకు మళ్లుతున్నారు. గ్యాస్ అయిపోతే ీVAటళ్లను ముందుగానే మూసేయడం లే దా కొన్ని బ్రాంచ్‌లను మాత్రమే నడపడం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి నేపథ్యంలో తెలంగాణ ీVAటల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. పరిస్థితి కుదుటపడకపోతే ీVAటళ్లను పూర్తిగా బంద్ పెట్టే అవకాశం లేకపోలేదు. సాధారణంగా ీVAటళ్లలో 24 నుంచి 48 గంటలకు సరిపడా గ్యాస్ నిల్వలు మాత్రమే వుంటాయి. ఇప్పుడు సరఫరా నిలిచిపోవడం తో 90% చిన్న, మధ్య తరహా ీVAటళ్లు మూతపడే పరిస్థితి నెలకొంది.
ఈ కొరత పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రొపేన్, బ్యూటేన్లనుంచి ఎల్.పి.జి. ఉత్పత్తిని పెంచడానికి చమురు కంపెనీలు చర్యలు తీసుకోవాలని కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. తెలంగాణ పౌర సరఫరాల అధికార్లు మాత్రం రోజుకు 2.3లక్షల సిలిండర్లు సరఫరా చేస్తున్నామని, భయపడా ల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ప్రధానంగా పీజీ ీVAటళ్లకు (హాస్టళ్లు లేదా పేయింగ్ గెస్ట్ ీVAటళ్లు) సిలిండర్లు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి ీVAటళ్లు అమీర్‌పేట్, గచ్చీబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లో ఎక్కువగా వున్నాయి. ఇదిలావుండగా హైదరాబాద్‌లోని చమురు కంపెనీల్లో గహావసరాలకు సిలిండర్లు పుష్కలంగా వున్నప్పటికీ, వాణిజ్య అవసరాలకు కొరత ఏర్పడింది. గహ వినియోగదారులకు 25 నుంచి 30 రోజులకు సరిపడా నిల్వలున్నాయని అధికార్లు చెబుతున్నారు. ఇక వాణిజ్య సిలిండర్ల విషయానికి వస్తే, పాత స్టాక్‌నే ఇంకా వాడుతున్నారు. ఇది అయిపోతే ఇబ్బందులు తప్పవని ీVAటళ్ల సంఘంవారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వాల భౌగోళిక రాజకీయాల మాట ఎట్లా వున్నా, ఈ యుద్ధం త్వరగా ముగియాలని సామాన్యులు కోరుకుంటున్నారు.
