మండల జాగృతి అధ్యక్షుల ఆధ్వర్యంలో కమిటీలు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మండల జాగృతి ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా తెలంగాణ మండల జాగృతి అధ్యక్షులు కందుకూరి రామ గౌడ్ మాట్లాడుతూ మండలంలో పట్టణంలో తెలంగాణ జాగృతి కమిటీ లను వేశామని అలాగే రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉండి 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి అభినందిస్తూ అలాగే రాబోయే ఎన్నికల్లో బీసీలకు అన్ని సంక్షేమ పథకాల్లో గాని స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పిటిసి గాని ఎంపిటిసి గాని సర్పంచ్ గాని ఎన్నికల్లో రిజర్వేషన్ కేటాయించాలని ముఖ్యంగా మహిళలకు రిజర్వేషన్ అమలు అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్సీ కవితక్క గారు బీసీల గురించి మండల సభల్లో ఎన్నోసార్లు బీసీల గురించి స్థానికంగా ప్రసంగించారని తెలంగాణ జాగృతి ని రాష్ట్రంలో అన్ని వర్గాలకు అనుకూలంగా ప్రయోజనం పొందేలా ఎమ్మెల్సీ కవితక్క ఎప్పటినుండో పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాబోయే ముందు రోజుల్లో అన్ని కులాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ ప్రక్రియ కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేశారు అలాగే తెలంగాణ జాగృతి తంగళ్ళపల్లి మండలం యువజన కార్యదర్శిగా అనిల్ గౌడ్ ను తంగళ్ళపల్లి తెలంగాణ జాగృతి పట్టణ అధ్యక్షులుగా విబి రంగమును ఉపాధ్యక్షులుగా భానుమూర్తిని నియమించడం జరిగిందని ఇట్టి కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగత్.వెంగళ రమేష్ పసుల దుర్గయ్య మనోహర్ శ్రీనివాస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు