ఆహ్వాన పత్రిక ఆవిష్కరిస్తున్న కమిటీ సభ్యులు
విగ్రహప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ
-యాదవుల కులదేవతకు నూతనఆలయ నిర్మాణం
-గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన
-భక్తులు భారీగా హాజరుకావాలి: ఆలయ కమిటీ సభ్యులు.
మరిపెడ నేటిధాత్రి.
యాదవుల కులదేవత ఇంటి ఇలవేల్పు శ్రీశ్రీగంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో భక్తులు భారీగా పాల్గొనాలని రాంపురం శ్రీశ్రీగంగమ్మ తల్లి ఆలయ కమిటీ యాదవ కుల సంఘ పెద్దలు భక్తులను కోరుతున్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీగంగమ్మ తల్లి ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఆహ్వాన పత్రిక ను ఆలయ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 9 నుండి 13వ తారీకు వరకు వేద పండితులు బ్రహ్మశ్రీ అప్పి రవిశంకర్ శర్మ ఆధ్వర్యంలో వేద పండితులతో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవములు నిర్వహించడం జరుగుతుందని, ఏప్రిల్ 9న విగ్రహాల ఊరేగింపు, ఏప్రిల్ 11న గణపతి పూజ,హోమాలు మొదలైన పూజా కార్యక్రమాలు, ఏప్రిల్ 12న స్థాపిత దేవత హవానములు, రుద్ర దుర్గా హోమాలు, కలన్యాస వాహనము, ధాన్యాది,పుష్పాది,ఫలాది, శయ్యది వాసములు, షోడ, శోపచార పూజ, మంత్ర పుష్పము తీర్థప్రసాద వితరణ ఉంటాయని, ఏప్రిల్ 13 ఆదివారం చైత్ర బహుళ పాడ్యమి రోజున ఉదయం 8 గంటల 31 నిమిషములకు చిత్త నక్షత్ర యుక్త వృషభ లగ్న సుముహూర్తములో యంత్ర విగ్రహ ప్రతిష్ట, బలి ప్రధానము, అవృదస్థానము నేత్ర దర్శనము వేద పండితులచే ఆశీర్వచనము ఉంటాయని తెలిపారు. కావున ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు నియమ నిష్ఠలతో వచ్చి గంగమ్మ తల్లిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు యాదవ కుల సంఘ పెద్దలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటీసీ కొమ్ము నరేష్,కొమ్ము చంద్రశేఖర్,కోడి శ్రీకాంత్,వల్లపు లింగయ్య, కొమ్ము లింగయ్య,కొమ్ము ఉప్పలయ్య, కొమ్ము ఐలయ్య,కోడి మహేష్ తదితరులు పాల్గొన్నారు.