
Congress Stands Firm on 42% BC Reservation
బీసీలకు 42 శాతం రిజర్వే షన్లకు కట్టుబడి ఉన్నాo
బీఆర్ఎస్,బిజెపిలే అడ్డు కున్నాయి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
న్యాయస్థానాల నుండి ఎలాంటి స్పందన ఉన్నా బీసీలకు 42 శాతం రిజర్వే షన్లు ఇస్తామని ఇచ్చిన హామీ పై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఆ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. శుక్రవారంమండ లంలోని కొప్పుల జోగంపల్లి పెద్దకొడెపాక, గోవిందపూర్ హుస్సేన్ పల్లి ,పత్తిపాక గ్రామా లలో ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో కేంద్రం ఓటు చోరి కి పాల్పడుతుందని ప్రజల సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల లో బుచ్చిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శాస్త్రీయంగా కులగణన చేసి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, శాసన సభలో బిల్లు పాస్ చేయించి గవర్నర్, రాష్ట్రపతికి పంపిస్తే బిజెపి అడ్డుకుందని ఆరోపిం చారు. అలాగే 2019 స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల రిజర్వేషన్లను అప్పటి బీఆర్ ఎస్ ప్రభుత్వం 50 శాతం మించకుండా కుదించింది. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కులగననచేసి రిజర్వేషన్లు పెంచాల్సి ఉండగా ఎందుకు పెంచ లేదో బీసీలకు సమాధా నం చెప్పాలని డిమాండ్ చేశారు. బిజెపి, బీఆర్ఎస్ లు బీసీల వ్యతిరేక పార్టీలుగా మిగిలి పోయాయని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి అధికార దుర్వినియోగానికి పాల్పడు తూ ఓటు చోరీ చేస్తుందని, ఓటు చోరి ఆపాలంటూ రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ పోరాటానికి మద్దతుగా ప్రజల వద్ద సంతకాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయ కులు పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి మారేపల్లి రవీందర్ చిందం రవి, చిట్టి రెడ్డి రాజిరెడ్డి డిటి రెడ్డి సామల మధుసూదన్ నిమ్మల రమేష్ వైనాల కుమార స్వామి హైదర్ కుమారస్వామి వెంకట్ రాజిరెడ్డి ఏరుకొండ శంకర్ కొమ్ముల సదానందం పైడి బిక్షపతి భద్రయ్య నరేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.