వార్డుప్రజల సహకారంతోనే అభివృద్ధి-కౌన్సిలర్ జయంత్ లాల్
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని 21వ వార్డు కౌన్సిలర్ ఆర్ పి జయంత్ లాల్ ఆధ్వర్యంలో సిసి రోడ్డు మరియు సిసి డ్రైనేజీ పనులను పరకాల మున్సిపల్ కమిషనర్ కే నరసింహ కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ 21వ వార్డు పరిధిలోని సుధమల్ల సమ్మయ్య వీధిలో వార్డు ప్రజల సమస్య గమనించి కౌన్సిల్ సమావేశంలో 14 వ ఫైనాన్స్ నిధుల నుండి 7 లక్షల అభివృద్ధి పనులకు నిధులు కేటాయించడం జరిగింది.వార్డు ప్రజల సహాయ సహకారాలతో వారి సమస్యలు పరిష్కారానికి మరియు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్ రెడ్డి,సోదా రామకృష్ణ,ఏకు రాజు,పసుల రమేష్,మార్కా రఘుపతి,బండి సదానందం, షబ్బీర్ అలీ,పరకాల మున్సిపల్ ఏఈ వంశీ,మరియు వార్డు నాయకులు బొల్లె బిక్షపతి మాజీ జెడ్పిటిసి,సుధమల్ల రమేష్,దేవు స్వామి,శ్రీధర్ రాజు, సురేష్,తదితరులు పాల్గొన్నారు.