– మేకల ప్రభాకర్ యాదవ్
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ మీద చేసిన అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్ ఖండించారు. ఈసందర్భంగా ప్రభాకర్ యాదవ్ మాట్లాడుతూ సుంకె రవిశంకర్ మీకు బండి సంజయ్ కుమార్ ని విమర్శించే స్థాయి మీకు లేదన్నారు. బండి సంజయ్ కుమార్ అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా, కార్పోరేటర్ గా, రెండు సార్ల ఎమ్మెల్యేగా అతి తక్కువ ఓట్లతో ఒడిపోయినారని, ఆతరువాత పార్లమెంట్ సభ్యులుగా భారీమెజార్టీతో గెలిచి, జాతీయపార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా సేవలు అందించారని, మీరు ఎదో గుడ్డిగా గాలిలో ఎమ్మెల్యేగా గెలిచారు కానీ మీకు ప్రజలలో ఆదరణ లేదని, ప్రజలలో ఆదరణ ఉన్న నాయకులు బండి సంజయ్ కుమార్ అని, ప్రజల కోసం మూడు సార్లు జైలుకు వెళ్లిన ఘనత బండి సంజయ్ కుమారుదని అటువంటి నాయకుని మీద అవాకులు, చెవాకులు పేలితే బాగుండదని హెచ్చరించారు. ఓడిపోయి ఏంమాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారన్నారు. మా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుని మీద మాట్లాడితే కెసీఆర్ దృష్టిలో పడరని, మీఅధిష్టానం, మీకార్యకర్తలు, ప్రజలు మిమ్మల్ని గుర్తించే పరిస్థితులలో లేరని చమత్కరించారు. మీపార్టీ హిందువుల పార్టీ అని అంటున్నారు కొండగట్టు ప్రమాదంలో అరవై మందికి పైగా చనిపోతే ఏనాడన్నా పరామర్శించారా, మాకేంద్ర ప్రభుత్వం రెండులక్షల నష్ట పరిహారం చెల్లించారని అన్నారు. ఈకార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఉప్పు రాంకిషన్, జిల్లా కార్యవర్గ సభ్యులు పొన్నం శ్రీనివాస్ గౌడ్, ఉప్పు శ్రీనివాస్, తిర్మలాపూర్ గ్రామ ఎంపీటీసీ సభ్యులు మోడీ రవీందర్, మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, యువమోర్చా మండల ఉపాధ్యక్షులు బండారి శ్రీనివాస్, యువమోర్చా నాయకులు పల్లపు చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.