
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం షెట్ పల్లి గ్రామంలో గల శ్రీ కోదండ రామాలయంలో రానున్న శ్రీరామనవమి పండుగ సందర్భంగా బుధవారం ఉదయం ఘనంగా అంగరంగ వైభవంగా వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య సప్త హోమం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్విరామంగా వారం రోజులపాటు అనగా శ్రీరామనవమి రోజు వరకు కొనసాగుతుందని భక్తులందరూ పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరాములవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. అలాగే ఈ వారం రోజులపాటు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని తెలిపారు.