
హాస్య నటుడు.. ఫిష్ వెంకట్ కన్నుమూత
హాస్య నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. ఎన్నో చిత్రాల్లో తనదైన శైలి హాస్యంతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించిన ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు
హాస్య నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) కన్నుమూశారు. ఎన్నో చిత్రాల్లో తనదైన శైలి హాస్యంతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించిన ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. వి.వి. వినాయక్ సినిమాల ద్వారా పాపులర్ అయిన అయన దాదాపు నాలుగేళ్లగా కిడ్నీల సమస్యతో బాధ పడుతున్నారు. తన రెండు కిడ్నీలు దెబ్బతినడంతో డయాలసిస్ ద్వారా చికిత్స పొందుతున్నారు.
ప్రస్తుతం బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. రెండు కిడ్నీలని మార్పిడి చేయాలని, ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉందని వైద్యులు చెప్పినట్లు ఇటీవల ఆయన కుమార్తె స్రవంతి తెలిపిన సంగతి తెలిసిందే! వైద్య సేవలకి ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నామనీ, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరారు. (FIsh Venkat is no more)
విశ్వక్సేన్, జెట్టి సినిమా హీరో కృష్ణ మానినేని వంటి వారు ఆర్థిక సాయం అందించారు. అయినా సర్జరీకి సరిపడ డబ్బు సమకూరలేదు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో శుక్రవారం రాత్రి ఫిష్ వెంకట్ తుది శ్వాస విడిచారు. ‘ఆది’, ‘దిల్’, నాయక్, ‘అత్తారింటికి దారేది’ వంటి హిట్ సినిమాల్లో వెంకట్ నటించారు. గబ్బర్ సింగ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చివరగా కాఫీ విత్ ఏ కిల్లర్ సినిమాలో కనిపించారు.