
ప్రభుత్వ అధికారులు రోడ్ల మరమ్మత్తు ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది అని కాలనీ వాసులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గంలో రాంనగర్ – తాండూర్ రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో రాంనగర్ నుండి తాండూర్ వరకు వెళ్లే ప్రధాన రహదారి గత కొన్ని సంవత్సరాలుగా మరమ్మత్తులు జరగకపోవడంతో తీవ్రంగా దెబ్బతింది. ముఖ్యంగా బిరుజు ప్రాంతం వద్ద రోడ్డు పూర్తిగా ధ్వంసమై పొడుచుకుపోయిన గుంతలతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఈ మార్గాన్ని ఉపయోగించే గ్రామస్తులు, విద్యార్థులు, రైతులు రోజు రోజుకూ ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షాకాలంలో అయితే ఈ రహదారి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఎన్నోసార్లు అధికారులను, ప్రజా ప్రతినిధులను గుర్తు చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టకుంటే తీవ్ర ఆందోళనలు చేపడతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు. రాంనగర్ నుంచి తాండూర్ వరకు దాదాపు 15 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ రహదారి జిల్లా ప్రజల రవాణా అవసరాలకు కీలకంగా ఉండడంతో వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కాలనీవాసులు మహమ్మద్ ఇమ్రాన్ మదినం శివ జాకీర్ సిరాజ్ గోపాల్ అడ్వకేట్ గణేష్ రవి ఇస్మాయిల్ షేక్ ప్రేమ్చంద్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.