College Bandh by PDSU Successful
పీడీఎస్యు ఆధ్వర్యంలో కళాశాలల బంద్ విజయవంతం
నర్సంపేట,నేటిధాత్రి:
పీడీఎస్యు ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలో నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైంది. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెండింగ్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు గుర్రం అజయ్ మాట్లాడుతూ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు చంద్రబోస్, ఉషా కిరణ్, సందీప్, శ్రీకాంత్, అనిల్ షఫీనా, పూజ, అభినయ, అఖిల తదితరులు పాల్గొన్నారు.
