జిల్లా వైద్య అధికారులకు కలెక్టర్ ఆదేశాలు.

Collector's orders to district medical officers.

ఎండ కాలంలో వడ దెబ్బె మందులు సిద్ధంగా ఉంచుకోవాలి

జిల్లా వైద్య అధికారులకు కలెక్టర్ ఆదేశాలు

వనపర్తి నేటిదాత్రి:

వనపర్తి జిల్లా జిల్లాలో సంక్రమిత, అసంక్రమిత వ్యాధులను
నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వైద్య అధికారులను ఆదేశించారు.క్షయ వ్యాధిమధుమేహం వేసవి కాలంలో వచ్చే వడదెబ్బలను అరికట్టేందుకు వైద్య శాఖ ద్వారా చేపడుతున్న చర్యల పై గురువారం కలెక్టర్ ఛాంబర్ లో సమీక్ష నిర్వహించారు.మిషన్ మధుమేహ ద్వారా జిల్లాలోని 40 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి మధుమేహం వ్యాధిని ముందుగానే గుర్తించి వ్యాధి నివారణకు అవగాహన మందులు ఇవ్వడం జరుగుతుంది. జిల్లాలో 40 సంవత్సరాల వయస్సు పైబడిన ప్రతి ఒక్కరికీ నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు ఇప్పటి వరకు దాదాపు 70 శాతం పూర్తి అయ్యిందని మిగిలినవి మార్చి 25 లోపు పూర్తి చేయాలని వైద్య అధికారులను ఆదేశించారు.
జిల్లాలోమధుమేహం బారిన పడకుండా ఉండటానికి, వచ్చినవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహారపు అలవాట్లలో మార్పులు వ్యాయామం పై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడమే కాకుండా గోడపత్రికలు చేయించి ప్రచారం చేయాలని ఆదేశించారు.
జిల్లాలోని అనుమానిత లక్షణాలు ఉన్న క్షయవ్యాధిగ్రస్తులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించే ప్రక్రియ వందశాతం పూర్తి చేయాలని ఏ ఒక్క అనుమానితున్ని వదిలిపెట్టవద్దని కలెక్టర ఆదేశించారు .దాదాపు 99 శాతం ప్రక్రియ పూర్తి అయ్యిందని మిగిలిన ఒక్క శాతం సైతం త్వరలో పూర్తి చేస్తామని ప్రోగ్రాం ఆఫీసర్ డా సాయినాథ్ రెడ్డి తెలిపారు. క్షయవ్యాధి నిర్ధారణకు గల్లా పరీక్షతో పాటు ఎక్సరే తీసి క్షయవ్యాధి నిర్ధారణ పకడ్బందీగా చేయాలని సూచించార.వేసవి కాలంలో వడదెబ్బ బారిన పడకుండా అవగాహనతో పాటు అవసరమైన మందులు అన్ని ప్రాథమిక కేంద్రాల్లో సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు ముఖ్యంగా ఉపాధిహామీ లో పనిచేసే వారికి ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు ముందుగానే అందుబాటులోఉంచాలని సూచించారు ఎవరైనా వడదెబ్బకు గురి అయితే సెలైన్, అవసరమైన మందులు ఇచ్చి పూర్తిస్థాయి వైద్యం అందించే విధంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.వడదెబ్బ బారిన పడకుండా తగిన సలహాలు సూచనలు ప్రచారం చేయాలని సూచించారు.జిల్లా వైద్య అధికారి డా. శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్లు డా. సాయినాథ్ రెడ్డి, డా. రామచంద్ర రావు. డా. పరిమళ, బాసిత్ డి పి ఆర్ ఓ వైద్య అధికారులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!