Telangana Talli Statue Unveiled by Collector
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసిన కలెక్టర్
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ స్పూర్తి తరతరాల పాటు వికసించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.
మంగళవారం ఐడిఓసి కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలో ఐక్యత, ఆత్మగౌరవాన్ని పెంపొందించే ప్రతీకగా తెలంగాణ తల్లి నిలుస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధిలో ప్రతి వ్యక్తి పాత్ర ఎంతో ముఖ్యమని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, ఆర్డిఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
