వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా శనివారం రోజున వేములవాడ పట్టణాల్లో జూనియర్ కాలేజీలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లు, సర్దాపూర్ వద్ద గల ఈవిఏం గౌడన్ లను అధికారులతో కలిసి పరిశీలించి తగు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ.జిల్లా కేంద్రంలోని సర్ధపూర్ లో గల ఈవీఎం గోడౌన్లు,సిరిసిల్ల ,వేములవాడ పట్టణాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం రోజున అధికారులతో కలిసి సందర్శించారు. ప్రస్తుత సాధారణ ఎన్నికలలో వినియోగించాల్సి ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల వివరాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
వీరి వెంట అదనపు కలెక్టర్ ఖిమ్య నాయక్, డిఎస్పీ నాగేంద్రచరి, రవికుమార్, సి.ఐ లు ఎస్.ఐ లు అధికారులు ఉన్నారు.