వనపర్తి నేటిదాత్రి :
వచ్చే హరిత హారానికి మొక్కలు వనపర్తి జిల్లా నుండే వాడుకునె విధంగా నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. గురువారం ఉదయం పెద్దమందడి మండలం జంగమయాపల్లి గ్రామ పరిధిలోని అటవీ శాఖ నర్సరీని సందర్శించి పరిశీలించారు.
వేసవిలో మొక్కలు ఎండిపోకుండా సరైన విధంగా నీరు పోసి ఎప్పటికప్పుడు బ్యాగులు మారుస్తూ మొక్కలను సమీక్షించాలని సూచించారు. వచ్చే హరిత హారం కార్యక్రమానికి జిల్లాకు అవసరమైన మొక్కలు జిల్లాలోని నర్సరీల నుండే వాడుకునే విధంగా చూడాలని సూచించారు . మొక్కల పెంపకం గురించి ఆరా తీశారు. చనిపోయిన వారి స్థానంలో మరోమారు విత్తనాలు వేసి మొక్కలు వచ్చే విధంగా చూడాలని సూచించారు. ఎండాకాలంలో మొక్కలు ఎండిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. పండ్ల మొక్కల పెంపకంపై దృష్టి పెట్టాలని సూచించారు.