వనపర్తి నేటిదాత్రి
ఈనెల 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు 25న జాతీయ ఓటర్ దినోత్సవ కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తేజస్ నందాలా ల్ పవర్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిoచారు గణతంత్ర వేడుకలు వనపర్తి లో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు గణతంత్ర వేడుకల నిర్వహణ బాధ్యతను అధికారులకు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్లు లోకల్ బాడీస్ సంచిత గంగ్వార్ రెవెన్యూ ఎస్ తిరుపతి రావు అధికారులు పాల్గొన్నారు