
Land acquisition applications should be resolved quickly...
భూభారతి దరఖాస్తుల త్వరితగతిన పరిష్కరించాలి
నర్సంపేట ఆర్డీఓ కార్యాలయం సందర్శన
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమం ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని, దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావులేకుండా వెంటనే ఆర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.బుధవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలసి నర్సంపేట ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా రెవిన్యూ డివిజన్లోని 6 మండలాల తహసిల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు?.ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి?. ఎంత మందికి నోటీసులు ఇచ్చారు?. క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా..? లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా, పీఓటీ లకు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలించాలని వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ.. వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమీక్షలో ఆర్డీఓ ఉమారాణి, తహశీల్దార్లు
రవిచంద్ర రెడ్డి, రాజేశ్వరరావు, రాజ్ కుమార్, అబిడ్ అలీ, రమేష్, కృష్ణా, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.