
Villagers of Batinapalli Demand Road from Collector
కలెక్టర్ సారు మా గ్రామానికి రోడ్డు వేయండి
బిటిరహదారి లేక బత్తినపల్లి గ్రామ ప్రజల అవస్థలు వర్ణనాతీతం
నేటిధాత్రి చర్ల
చర్ల మండల కేంద్రంలోని తిప్పాపురం గ్రామపంచాయతీ పరిధిలో గల బత్తినపల్లి గ్రామానికి సరైన రహదారి లేక ఆ గ్రామ ప్రజలు నరకయాతన పడుతున్నారు వర్షం పడితే ఉన్న రహదారి మొత్తం బురదమయంగా మారి మోటార్ వెహికల్ కూడా నడవలేని పరిస్థితి ఆరోగ్యం బాగోలేని వారిని ఈ రహదారి వెంబటి తరలించాలంటే చుక్కలు కనబడుతున్నాయి అని అంటున్నారు గతంలో ఈ రోడ్డు మంజూరు అయినప్పటికీ ఫారెస్ట్ అధికారుల పర్మిషన్ లేదని సదరు కాంట్రాక్టర్ రోడ్డు వేయలేదు భద్రాద్రి జిల్లా ఫారెస్ట్ అధికారి పర్మిషన్ లేకపోవడం వలన ఈ రహదారి నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా ఈ రోడ్డు వేసి మా గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలని బత్తిన పల్లి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు గతంలో భద్రాద్రి జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీఏ పీవో మరియు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మరియు తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధ్యక్షులు పోదేం వీరయ్యను కలసి ఈ గ్రామ ప్రజలు పలుమార్లు వినతి పత్రాలు అందించినప్పటికీ ఈ రహదారి నిర్మాణం చేపట్టకపోవడం వలన ఈ గ్రామ ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు అంతేకాకుండా బత్తినపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీరు సరిగా రాకపోవడం వలన తీవ్ర మంచినీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు ఇకనైనా భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ మరియు ఐటీడీఏ రాహుల్ ప్రత్యేక చొరవ తీసుకొని బత్తినపల్లి గ్రామానికి రహదారి నిర్మించి ఈ గ్రామ ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరుకుంటున్నారు