మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ ఘన నివాళి
సిరిసిల్ల, ఏప్రిల్ -11(నేటి ధాత్రి):
మహాత్మ జ్యోతిరావు పూలే కు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఘనంగా నివాళులు అర్పించారు. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం నిర్వహించగా, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ హాజరై జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్ రావు, డీపీఆర్ఓ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.