గంగాధర నేటిధాత్రి :
గంగాధర మండలంలోని గర్శకుర్తి గ్రామంలో గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ దళారులను ఆశ్రయించకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలన్నారు. ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటుందని, కొనుగోలు చేసిన వారం రోజుల్లో ధాన్యం డబ్బులను రైతు ఖాతాల్లో జమ చేస్తామని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించడంతోపాటుగా కోతలు లేకుండా కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్ర నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్, ఎమ్మార్వో, మండలంలోని అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.