వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఎమ్మెల్యే.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని రైతులకు రెండు లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా ఇచ్చి ఆదుకుందన్నారు, అలాగే సన్న వడ్లకు 500 బోనస్ ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ఏ అన్నారు, ధరణి వల్ల రైతులు తమ భూములకు హక్కుదారులుగా కోల్పోయినరని రైతులు ఆవేదన చెందారు, భూ యాజమాన్య హక్కులను కల్పించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతిని తీసుకొచ్చిందన్నారు రానున్న కాలంలో రైతులకు అనేక సంక్షేమ ఫలాలు అందించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గూట్ల తిరుపతి, మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు వంశీ చిలకల రాయ కొమురు, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డికిష్టయ్య, టౌన్ అధ్యక్షులు బుర్ర లక్ష్మణ్ గౌడ్, మాజీ ఎంపిటిసి దబ్బేట అనిల్, కాంగ్రెస్ మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.