జైపూర్,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ లోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో డ్రైనేజీ పైప్లైన్ బ్లాక్ కావడం జరిగింది. డ్రైనేజ్ సమస్యను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ దృష్టికి తీసుకువెళ్లగా వారు స్పందించి రామగుండం మున్సిపల్ కమిషనర్ తో మాట్లాడి హైడ్రాలిక్ జెడ్ మిషన్ పంపించాలని కోరారు. రామగుండం మున్సిపల్ కమిషనర్ సోమవారం హైడ్రాలిక్ జెట్ మిషన్ పంపించడంతో గురుకుల పాఠశాల లో బ్లాక్ అయిన పైప్ లైన్ పూర్తిగా క్లీనింగ్ చేపించారు.ఈ సందర్భంగా గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు జిల్లా కలెక్టర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కె నాగేశ్వరరావు, ఎంపీ ఓ శ్రీపతి బాబురావు, పంచాయతీ కార్యదర్శి బి.ఉదయ్ కుమార్,జూనియర్ అసిస్టెంట్ టి.మల్లేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.