
Collector Inspects Marikunta Cheruvu and Library
మరికుంట చెరువు గ్రంధాలయం తనిఖీ చేసిన కలెక్టర్
వనపర్తి నేటిదాత్రి .
https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x
మరికుంట చెరువు నుంచి నీరు సజావుగా వెళ్లేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ మర్రికుంట చెరువును తనిఖీ చేశారు అక్కడ నుంచి నీటి ప్రవాహ మార్గాలను, పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను వేగవంతం చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని నిరుద్యోగ యువత, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ గ్రంథాలయానికి వచ్చిన పాఠకులకు సూచనలు చేశారు
అదేవిధంగా జిల్లా గ్రంథాలయం భవనం మొదటి అంతస్తు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారుల ను ఆదేశించారు.
మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, తహసిల్దార్ రమేష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంకు మేనేజర్ శివప్రసాద్, సాయి, ఇంజనీరింగ్ అధికారులు, స్థానికులు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు