
Collector Advait Kumar Singh
రైతులు అవసరానికే యూరియా కొనుగోలు చేయాలి…
జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
కేసముద్రం/ నేటి ధాత్రి
గురువారం జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కేసముద్రం మండలంలో ఫర్టిలైజర్ దుకాణాలను, పాలిటెక్నిక్, జిల్లా పరిషత్ ఉన్నత పతశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా కలెక్టర్ కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలోని ఫర్టిలైజర్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ స్టాక్ నిలవలను రైతు వారీగా యూరియా కొనుగోలు వివరాలను పరిశీలించారు. యూరియా పంపిణీపై రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్, యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని యూరియా గురించి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, రైతులు ప్రస్తుత అవసరం మేరకే యూరియా కొనుగోలు చేయాలని, జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తెలిపారు. క్కువ రద్దీ కాకుండా.. ఉదయాన్నే షాప్ లను తెరవాలని…రైతులను ఇబ్బంది పెట్టకుండా యూరియా అమ్మకం జరగాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా లో సరిపడా యూరియా ఎప్పటికప్పుడు సరఫర అవుతోందని.. రైతులు ఆందోళన చెందాలిసిన అవసరం లేదన్నారు. ఎవరైన కృత్రిమ కొరత సృష్టించాలని చేసిన, అధిక ధరలకు విక్రయించిన వారి పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఎరువుల దుకాణంలో ఒక్కో రైతు వారీగా కొనుగోలు చేసిన వివరాలు రిజిస్టర్లు అప్డేట్ గా ఉండాలని అన్నారు.
అనంతరం కేసముద్రం మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాటశాలను తనిఖీ చేసి కిచెన్ షెడ్, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థులకు రుచికరమైన పరిశుభ్రమమైన వేడి వేడి ఆహార పదార్థాలను వడ్డించాలని, చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, అన్నారు. విద్యార్థుల యొక్క అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థులకు టీచర్లు సులభమైన, అర్థవంతమైన పద్దతిలో పాటాలు నేర్పాలని అన్నారు.
డోర్నకల్ మండలం లోని శ్రీ బాలాజీ ఫెర్టిలైజర్ దుకాణాన్ని రెవెన్యు అదనపు కలెక్టర్ కె. అనిల్ కుమార్ తనిఖీ చేసి షాపులోని నిల్వలను, రైతులు కొన్న రశీదులను పరిశీలించారు.
ఈ తనిఖీ లో సంబందిత వ్యవసాయ అధికారులు, తహసిల్దార్ లు కళాశాల ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయుడు, తదితరులు పాల్గొన్నారు.