
Collector
ఎరువుల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
యూరియా వచ్చిన వెంటనే డీలర్లు రైతులకు సరఫరా చేయాలి
అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
జిల్లా కలెక్టర్” మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
కేసముద్రం/ నేటి ధాత్రి
కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో గల కావ్య ఏజెన్సీస్ ఎరువుల దుకాణాన్ని ఆకస్మికంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్” మ్యాజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ , సహాయ వ్యవసాయ సంచాలకులు మహబూబాబాద్ డివిజన్ అజ్మీరా శ్రీనివాసరావు తో కలిసి ఎరువుల దుకాణాలలో గల యూరియా నిలువలను తనిఖీ చేయడం జరిగింది, వారు స్టాక్ రిజిస్టర్, బ్యాలెన్స్, పి ఓ ఎస్ మిషన్ బాలన్స్, గోడం బ్యాలెన్స్, స్టాక్ బోర్డు వివరాలు ఇన్వైస్లను తనిఖీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎరువుల డీలర్లు తమ షాపులో ఉన్నటువంటి యూరియా నిలువలను ఉంచుకొని ఎవరైనా యూరియా రైతులకు సరఫరా చేయకపోయినా, అధిక ధరలకు విక్రయించిన కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు, రైతులకు పిఓఎస్ మిషను మరియు ఆధార్ కార్డు, పట్టాదారు పాసు బుక్ జీరా క్సు ద్వారా మాత్రమే యూరియాను, ఇతర ఎరువులను సప్లై చేయాలని వారు కోరారు, ప్రతి ఎరువుల డీలర్లు తమకు వచ్చినటువంటి యూరియా నిలువలను ప్రతిరోజు ఎప్పటికప్పుడు మండల వ్యవసాయ అధికారి కి తెలియజేయాలని వారు సూచించారు, యూరియా వచ్చిన వెంటనే ఎరువుల డీలర్లు రైతులకు సరఫరా చేయాలని వారు కోరారు.
ప్రతిరోజు ఎరువుల నిల్వలను స్టాకు రిజిస్టర్ అప్డేట్ చేయాలని, స్టాక్ బోర్డు ద్వారా ప్రతిరోజు నిలువలు రైతులకు కనిపించే విధంగా, బోర్డులు రాయాలని,
ప్రతిరోజు తమకు వచ్చే యూరియా నిల్వలను వెంటనే మండల వ్యవసాయ అధికారి కి తెలియజేసి, వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో యూరియా పంపిణీ వెంటనే పూర్తి చేయాలని వారు సూచించారు నియమ నిబంధనలు అతిక్రమించిన ఎరువుల డీలర్ల పై నిత్యవసరం వస్తువుల చట్టం 1955 మరియు ఎరువుల నియంత్రణ చట్టం 1985 ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు సూచించారు, ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్, బిల్ బుక్కులు,ఇన్వైస్లు,స్టాక్ బోర్డులు అప్డేట్ చేయాలని వారు సూచించారు.
దఫా ల వారీగా యూరియా మండలానికి వస్తున్నందున రైతులు ఎవరూ అధైర్య పడొద్దని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో, మండల వ్యవసాయ అధికారి కేసముద్రం బి వెంకన్న, వ్యవసాయ విస్తరణ అధికారి సాయి చరణ్ పాల్గొన్నారు