Medical Staff Launch Signature Campaign
వైద్య ఉద్యోగుల సంతకాల సేకరణ
డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసస్ ఏర్పాటు చేయాలి
ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్
పరకాల,నేటిధాత్రి
వైద్య విధాన పరిషత్ రద్దు చేసి,ఆ స్థానంలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఏర్పాటు చేసి,ట్రెజరీ ద్వారా సాలరీస్ (010) చెల్లించాలని పరకాల పట్టణంలోని ప్రభుత్వ దవాఖానా ఉద్యోగులు డిమాండ్ చేసారు.వైద్యశాలలో యావన్మంది ఉద్యోగులు సామూహికంగా సంతకాలు సేకరించి,అధికారులకు అందజేశారు.ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ 1986 వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన వైద్య విధాన పరిషత్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణింపక పోవడం,వేతన సవరణ సంఘానికి వినతులు సైతం సమర్పించక లేకపోవడం,ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించకపోవడంతో ఈ రోజు వరకు జీతాలు పొందలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.మరో వైపు పక్క రాష్ట్రం ఏ.పి.లో వైద్య విధాన పరిషత్ రద్దు చేసి,ఆ స్థానం లో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసస్ ఏర్పాటు చేసారని మన రాష్ట్రంలో కూడా అలాగే చేయాలని పేర్కొన్నారు.దశల వారీగా చేపట్టిన ఆందోళనలో భాగంగా ఈ రోజు ఉద్యోగుల ఆకాంక్ష అధికారులకు తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైద్యశాలల ఉద్యోగులు సామూహికంగా సంతకాలు సేకరించి అధికారులకు అందజేశామన్నారు.లేకుంటే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో డాక్టర్స్,నర్సులు,పారామెడికల,నాల్గవ తరగతి రెగ్యులర్ ఉద్యోగుల పాల్గొన్నారు.
