కలెక్షన్‌ కింగ్‌ సింగ్‌!

https://epaper.netidhatri.com/view/349/netidhathri-e-paper-15th-aug-2024/2

`మణికొండ సర్కిల్‌ లో నిర్మాణాలపై నజర్‌.

`జిహెచ్‌ఎంసిలో సింగ్‌ను అడిగేవారు లేరు.

`డిసి కన్నా టిపిఓ పవర్‌ పుల్‌.

`వచ్చి ఆరు నెలలు…సంపాదక కోట్లకు కోట్లు.

`15 మంది ప్రైవేటు సైన్యం.

`రోజుకో కాలనీ మీద దృష్టి.

`నిర్మాణాలకున్న అనుమతుల తనిఖీ.

`లక్షలు వసూలు…లేకుంటే హెచ్చరికలు.

`కూల్చేస్తామని బెదిరింపులు…

`భయపడి లక్షలు సమర్పించుకుంటున్న బాధితులు.

`సింగ్‌ అరాచకాలకు అడ్డూ అదుపు లేదు.

`పై అధికారులకు వాటాలు…అందరి నోళ్లకు తాళాలు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఉద్యోగం వెలగబెట్టడం అంటే ప్రజలకు సేవ చేయడం అనే విషయాన్ని కొలువు చేస్తున్న వారు రాను రాను మర్చిపోతున్నారు. ఓ వైపు వేతన జీవులం…అని చెప్పుకుంటూ ప్రభుత్వం నుంచి కొట్లాడి మరీ హక్కులు సాధించుకుంటున్నారు. మరో వైపు ప్రజలను పీడిరచడమే పనిగా పెట్టుకొని కొంతమంది లంచాలకు మరిగిన ఉద్యోగులు కోట్లు సంపాదించుకుంటున్నారు. అలాంటి అవినీతి పరులలో సంతోష్‌ సింగ్‌ ఒకరు. మణికొండ సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో అధికారి. మణికొండ సర్కిల్‌ పరిధిలో కొత్తగా నిర్మాణాలు చేపట్టిన, చేపట్టాలనుకునే వారికి సంతోషం లేకుండా చేస్తాడు. సంతోషం అన్న సందర్భం జీవితంలో కనిపించనంత వేధిస్తాడు. వారి నుంచి లక్షలు వసూలు చేసి జేబులు నింపుకుంటాడు. ఇప్పుడు జిహెచ్‌ఎంసి పరిధిలో ఎవరు మాట్లాడుకున్నా ఒకటే మాట…ఎవరు చర్చించుకున్నా ఒకటే ముచ్చట.. ఆ సింగ్‌ కలెక్షన్‌ కింగ్‌…కరెప్టెడ్‌ సింగ్‌! ఈ మాటలు, ఈ ఆరోపణలు ఇప్పటివి కాదు. ఎప్పటి నుంచో వున్నవే…ఇప్పటికే ఓసారి ఈ కలెక్షన్‌ సింగ్‌ సస్పెండ్‌ కూడా అయ్యారు. మళ్ళీ కొలువులో చేరాడు. అయినా భయం లేదు. ఎందుకంటే జీవితం గొర్రెబెత్తెడు. అది ఆ సింగ్‌ దృష్టిలో మాత్రమే. లక్షకుపైగా వచ్చే జీతం సదరు కింగ్‌ దృష్టిలో చిన్న అమౌంట్‌. కలెక్షన్‌ సింగ్‌ నెల జీతం అతను రోజు సంపాదనలో పది పైసలు కూడా చేయదని మణికొండ సర్కిల్‌ లో ఎవరిని కదించినా చెబుతారు. నిత్య సంతర్పణలు జేబుకు చేరుకోకుండా ఇంటికి చేరరు అని చెబుతుంటారు. సంపాదనలో అతని రూటే వేరు. ఒక ఉన్నతోద్యోగి అక్రమ సంపాదన ఇలా కూడా చేయొచ్చా! అని తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. పని కోసం ఎవరైనా కార్యాలయం కోసం వెళ్తే వచ్చే లంచపు సంపాదన గురించి వింటుంటాం. కానీ మణికొండ సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ అధికారి సింగ్‌ మాత్రం ఎవరు ఎలాంటి నిర్మాణం చేసుకున్నా సరే..అన్ని రకాల అనుమతులున్నా సరే వాళ్లే వచ్చి అడిగినంత అది కూడా లక్షల్లో సమర్పించుకోవాల్సిందే…లేకుంటే బుల్డోజర్‌ వచ్చేసినట్లే అన్నంతగా భయపెట్టించేస్తాడు. ఈ విషయం ఒక్కరు కాదు, ఎంతో మంది బహిరంగంగానే అంటున్న మాట. తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. సింగ్‌ మీద ఎన్ని ఆరోపణలున్నా పట్టించుకున్న వారు లేరు. ఎన్ని ఫిర్యాదులు అందినా చర్యలు తీసుకునే వారు లేరు.
సహజంగా ఏ ఉద్యోగైనా ఏదైనా పని చేసిపెడితే నాకెంతిస్తావని అడుగుతాడు.
బేరాలాడుతుంటాడు. అంతో ఇంతో లంచం తీసుకుంటాడు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా పని పూర్తికాగానే పార్టీలు అడిగేవారు. చాయ్‌కైనా డబ్బులు ఇవ్వవా? అడిగి పావలో…పరకో తీసుకునేవారు. కాకపోతే భయంతో పని చేసేవారు. పనుల కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో వుండేవారు. ప్రజల సమస్యలు వినేవారు. కాలం మారింది. ప్రభుత్వ కార్యాలయాల మెట్లు ఎక్కాలంటేనే సామాన్యులు గడగడలాడాల్సి వస్తోంది. అధికారుల తీరుతో సగటు వ్యక్తి గుండె ఆగిపోతోంది. పదుల రూపాయల లంచం నుంచి వందలు దాటి వేలను లెక్క చేయకుండా లక్షల లంచమిచ్చే ముచ్చట చెబితే తప్ప అధికారులు పని చేయడం లేదు. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి కార్యాలయంలో పని అంటే అంతే సంగతులు. గుండెను గట్టిగా అదిమిపట్టుకొని వెళ్లాల్సిందే! అంతలా ప్రజలను పీడిరచుకు తినడంలో సంతోష్‌ సింగ్‌ ఘనాపాఠి.
డిసి కన్నా టిపిఓ పవర్‌ పుల్‌. మణికొండ సర్కిల్‌ లో డిప్యూటీ కమిషనర్‌ కన్నా టిపిఓ వెరీ పవర్‌ పుల్‌.
అతను ఆడిరది ఆట. పాడిరది పాట. లంచాలు మెక్కడంలో సంతోష్‌ రూటే సెపరేటు. ఇప్పటి వరకు హైదరాబాదు లో దాదాలు, రౌడీ షీటర్లే గ్యాంగులు మెంటైన్‌ చేసేవారని విన్నాం. ఈ సింగ్‌ కూడా దాదాపు 20 మంది ప్రైవేటు సైన్యం ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్లందరికీ నెల నెలా జీతాలు. జల్సాలు. ఒక ఉద్యోగి ఓ 20 మందికి జీతాలివ్వడం అంటే అతని సంపాదన ఎంత వుండాలి? తాను నియమించుకున్న ప్రైవేటు సైన్యానికే నెలకు పది లక్షల రూపాయల దాకా ఖర్చు చేస్తారు. అంటే ఈ ఉద్యోగి ఒక్క రోజు లంచంతో సమానం. అంతగా లంచాలు తీసుకోవడంలో ఆరితేరిపోయాడు. అలా సంపాదించిన లంచాల సంపాదనలో కొంత మొత్తం ఆపై అధికారులకు కప్పం కడుతుంటాడు. గతంలో జాగీర్థారులు ప్రజలను పీడిరచి సంపాదించిన సొమ్ములో కొంత రాజులకు చెల్లించినట్లు, ప్రభుత్వ ఉద్యోగులైనందుకు వీళ్లు జనం మీద పడి దోచుకుతింటున్నారు. సర్కిల్‌ పరిధిలో కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి అనుమతులు పొందాలంటే లక్షలు ముట్డజెప్పాల్సిందే. ఇక నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి బిల్డింగ్‌ల యజమానులను రకరకాలుగా బెదిరించాలి. ఏదో ఒక లొసుగు ముందుంచాలి. సింగ్‌ ప్రైవేటు సైన్యం వివరాలు సేకరిస్తారు. సార్‌ పంపించారని బెదిరిస్తారు. వెంటనే సింగ్‌ రంగంలోకి దిగి బుల్డోజర్‌ పంపమంటావా? అని హెచ్చరిస్తారు. దాంతో బిల్డింగ్‌ యజమానులు తప్పని పరిస్థితుల్లో అడిగినంత అప్పగిస్తుంటారు. ఇదీ సింగ్‌ చేసే నిత్య దందా! అన్ని రకాల అనుమతులున్నా సరే…ఏదొ ఒక కారణం చూపి వసూలు చేయడంలో సింగ్‌ టెక్నికే వేరు.
గతంలో అనేక ఆరోపణలతో సింగ్‌ సస్పెండ్‌ అయ్యాడు.
కొంత కాలానికి కొలువులో చేరాడు. కొలువు తిరిగి పొందేందుకు పెద్దగా కష్డపడిరది లేదు. మళ్ళీ కొలువు పోయినా పెద్దగా ఫరక్‌ పడేది లేదు. ప్రభుత్వ ఉద్యోగం అంటే అక్షయ పాత్రలా తయారైంది. శాఖలు కామదేనువులా మారాయి. ఇంకేముంది దీపమున్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. కొలువు ఎంత కాలం వున్నా సరే…ఊడినా సరే…జీవితాంతం కష్టపడి రిటైర్‌ మెంటు తర్వాత సుఖపడేదేమీ వుండదు. తర్వాత కాలం ఎలాంటి చీకు చింత లేకుండా బతకాలి. తరతరాలు కూర్చొని తినాలి అనుకునే వారు ఉన్నత ఉద్యోగులలో చాలా మంది తయారయ్యారు. అవకాశం వున్నప్పుడే దండుకోవాలి. దోచుకోవాలి. దాచుకోవాలి. కొలువుకు ఇబ్బందులొస్తే వాటిలో కొంత వాళ్లది కాదనుకుంటే సరి…అనుకుంటున్నారు. ఇష్టానుసారం సంపాదనకు ఎగబడుతున్నారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే జీతాలు తీసుకుంటున్నామన్న సోయి లేదు. ప్రజల బిక్ష మీదనే ఆధారపడి బతుకుతున్నామన్న కృతజ్ఞతల అంతకన్నా లేదు. అందుకే మణికొండకు మళ్ళీ తిరిగి వచ్చి ఆరు నెలలు…సంపాదక కోట్లకు కోట్లు. ఇంతలా సంపాదిస్తూ వ్యవస్థకే సవాలు విసురుతున్నా పట్టుకుంటున్న వారు లేరు. సింగ్‌ మీద అనేక పిర్యాదులున్నాయి. అయినా చర్యలు తీసుకునే ధైర్యం ఎవరికీ లేకపోతోంది. తాను నియమించుకున్న 15 మంది ప్రైవేటు సైన్యంతో మణికొండ సర్కిల్‌ లో నిర్మాణాలపై నజర్‌ పెట్టించి, రోజుకో కాలనీ మీద పడుతుంటారు. నిర్మాణాలకున్న అనుమతుల తనిఖీ పేరుతో బెదరింపులకు దిగుతారు. లక్షలు వసూలు చేస్తున్నారు. అడిగిన దానికి ఒక్క పైసా తక్కువైనా కూల్చేస్తామని హెచ్చరిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేపట్టినా అందులో లొసుగులు ఆసరా చేసుకొని సంపాదనకు ఎగబడడంలో సింగ్‌ దిట్ట.
గతంలో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పడంతో, కనిపించిన ప్రతి బిల్డింగ్‌ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన చరిత్ర సింగ్‌ది అంటారు. ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హైడ్రా విభాగం మణికొండ టిపివో సంపాదనకు కలిసొచ్చేదిగా మారిందంటున్నారు. గతంలో తెలిసీ తెలియక రియల్‌ వ్యాపారుల వద్ద కొనుగోలు చేసి, కొన్ని సంవత్సరాలుగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిలో సింగ్‌ రైళ్లు పరగెత్తేలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అడ్డూ అదుపు లేకుండా సింగ్‌ ప్రజల నుంచి లంచాలు వసూలు చేస్తున్నారు. కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. కొత్తగా తెచ్చిన హైడ్రా సింగ్‌ లాంటి వాళ్లకు వరంగా మారనున్నదన్న మాటలు వినిపిస్తున్నాయి. జిహెచ్‌ఎంసి పరిధిలో హైడ్రా ఒక సంచలనంగా మారింది. ఆ సంస్థ కమిషనర్‌ రంగనాథ్‌కు అప్పగించారు. ఆయన అక్రమ కట్టడాలపై కొరడా రaుళిపిస్తున్నారు. హైడ్రా అనేది కేవలం చెరువుల ఆక్రమణ, ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్‌ భూముల చెరబట్టిన వారిపై దృష్టి పట్టాలి. అయితే నగర శివారులో కొన్ని దశాబ్దాలుగా చిన్ని చిన్న కుంటలను ఎప్పుడో మాయం చేశారు. ఇప్పుడు వాటి ఆనవాలు కూడా కష్టం. కానీ ప్రభుత్వం వద్ద వాటికి సంబంధించిన రికార్డులున్నాయి. ఇక చెరువుల విషయంలో అవి చిన్న కుంటలుగా మారి, ఆక్రమణలకు గురయ్యాయి. ఇప్పుడు ఆయా ప్రాంతాలలో జరిగిన రియల్‌ వ్యాపారులను నమ్మి కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్న వాళ్లు చాలా మంది వున్నారు. వాళ్లపై హైడ్రా దృష్టి పడకుండా చూస్తామని చెప్పి కూడా సింగ్‌ అనుచరులు దందా మొదలుపెట్డినట్లు సమాచారం. ఇలా ప్రభుత్వం చేసే మంచి పనులను కూడా ఆదాయ మార్గాలుగా మలుచుకొని అక్రమ సంపాదనకు ఎగబడిన సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకుంటే ప్రజలను దోచుకుతినేందుకు పై అధికారులు సహకరిస్తున్నట్లే అనుమానాలు కూడా వ్యక్తమౌతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!