
SHAP Chairman Ravi Naidu
*క్రీడల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి..
*అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు త్వరలోనే శంకుస్థాపన..
*ఏపీ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో శాప్ ఛైర్మన్ రవినాయుడు.
తిరుపతి(నేటి ధాత్రి) జూలై 30:
ఆనాడైనా ఈనాడైనా క్రీడల అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు కట్టుబడి పనిచేస్తున్నారని, ఆయన నేతృత్వంలో క్రీడల బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు అన్నారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో చిత్తూరు డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకూ నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్-2025(సీనియర్ మెన్ అండ్ ఉమెన్) పోటీలను మాజీ శాసన సభ్యురాలు సుగుణమ్మతో
ఆయన కలిసి ప్రారంభించారుతొలుత పలు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో బ్యాడ్మింటన్ ఆడి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో క్రీడాకారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సీఎం చంద్రబాబునాయుడు మొదటి నుంచి క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. త్వరలోనే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని వివరించారు. టీటీడీ, శాప్ నిధులతో ఆనాడే శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్సును ఆయన నిర్మించారన్నారు. ఏపీ నుంచి అంతర్జాతీయస్థాయి క్రీడాకారులను తయారుచేయాలనే సంకల్పంతో అంతర్జాతీయ క్రీడాకారులకు స్థలాలనిచ్చి అకాడమీల స్థాపనలకు కృషి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని కొనియాడారు. గత ముప్పై ఏళ్లుగా బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఫెడరేషన్లు సమర్థవంతంగా పనిచేస్తూ బ్యాడ్మింటన్ క్రీడను ముందుకు తీసుకెళ్లడం ప్రశంసనీయమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ క్రీడాసదుపాయాల కల్పనకు సీఎం కృషి చేస్తున్నారన్నారు. అత్యుత్తమ క్రీడా విధానాలను రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. అనంతరం తిరుపతి నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు సుగుణమ్మ మాట్లాడుతూ ఏపీలో క్రీడాభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, విద్యాశాఖామంత్రి నారా లోకేష్‌లు అపారమైన కృషి చేస్తున్నారన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న క్రీడాసదుపాయాలు, క్రీడా ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుని క్రీడాకారులు భవిష్యత్తులో మరింత మెరుగ్గా రాణించాలని సూచించారు. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా క్రీడాంధ్రప్రదేశ్ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎస్డీఓ శశి, బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.