
సిఎంఆర్ చెక్కుల పంపిణీ
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి సంబంధించిన లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేని తిరుమల, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవ్వాజి హరీష్ (తాజా మాజీ ఎంపీపీ) రామడుగు మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎనబై నాలుగు కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల నలభై వేల ఐదువందల విలువైన చెక్కులు అందించారు. ఈసందర్భంగా హరీష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి అండగా సీఎం రేవంత్ రెడ్డి నిలిచారని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలి పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పిండి సత్యం, మాజీ సర్పంచ్ కొల రమేష్, మాజీ మండల అధ్యక్షులు బొమ్మరవేని తిరుపతి, రాజమల్లయ్య,బాల గౌడ్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజాల శ్రీనివాస్ గౌడ్, కృష్ణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అనుపురం పరుశురాం గౌడ్ చంద్రారెడ్డి,నరేందర్ రెడ్డి, డైరెక్టర్ స్వామి, రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్, కనకయ్య, అంజయ్య, రాజేశం, మల్లేశం, బాపురాజు, మధు, రాంరెడ్డి, మనీష్, తదితరులు పాల్గొన్నారు.