
Congress Party State Leaders Dr. Siddham.
పేదల వైద్యానికి భరోసా సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
*-కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి *
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ టౌన్ పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి నివాసంలో గురువారం కోహీర్ మండలం మనియార్ పల్లీ గ్రామానికి చెందిన బి.బుజ్జమ్మ 60,000 /- (ఆరవై వేలరూపాయల) ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్దిదారు భర్తకు సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) చెక్కును కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ ముబీన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్షద్ పటేల్,శ్రీకాంత్ రెడ్డి,అక్బర్,జుబెర్,అశ్విన్ పాటిల్,అరుణ్,నరేష్ బబ్లూ,బి.మల్లికార్జున్,ఇమామ్ పటేల్,మహ్మద్.గౌసోద్దీన్,నర్సింహా యాదవ్,మానియార్ పల్లీ కాంగ్రెస్ నాయకులు అమర్నాథ్,మోహీన్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.