CM Revanth to Visit Narsampet on December 5
డిసెంబర్ 5 న నర్సంపేటకు సీఎం రేవంత్
ముఖ్యమంత్రి సభ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
డిసెంబర్ 5 న ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నర్సంపేటలో పర్యటించనున్నారు.సీఎం పర్యటన ఖరారైన నేపథ్యంలో నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి పట్టణంలోని పాఖాల రోడ్డులో గల జిల్లా మెడికల్ కాలేజీ ఆవరణలో గల స్థలాన్ని బహిరంగ సభకోసం పరిశీలించారు.అదే విధంగా మరో రెండు స్థలాలను కూడా పరిశీలించారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి,ఆర్డీఓ ఉమారాణి,నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్,టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్,పలువురు నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
