
జిహెచ్ఎంసికి బడ్జెట్లో రూ.1100 కోట్ల నిధుల కేటాయింపు పట్ల హర్షం
ఉప్పల్ నేటి ధాత్రి ఫిబ్రవరి 19
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి జిహెచ్ఎంసి కాంగ్రెస్ కార్పొరేటర్లు సోమవారం పాలాభిషేకం చేశారు.
రాష్ట్ర బడ్జెట్లో జిహెచ్ఎంసికి రూ.1100 కోట్ల నిధులను కేటాయించడం పట్ల కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు.
జిహెచ్ఎంసి కౌన్సిల్ సమావేశం సందర్భంగా బల్దియా కార్యాలయంలో కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేయడం జరిగింది.
జిహెచ్ఎంసి అప్పులకుప్పగా మార్చిన గత ప్రభుత్వం: రజిత పరమేశ్వర్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహానగర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నట్లు ఈ సందర్భంగా కార్పొరేటర్ మందుముల రజితపరమేశ్వర్ తెలిపారు.
ప్రభుత్వం నిధులను కేటాయిస్తూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు కృషి చేయడాన్ని హర్శించారు.
గత ప్రభుత్వం జిహెచ్ఎంసిని అప్పుల కుప్పగా మార్చిందన్నారు. రూ.7000 కోట్ల అప్పులను చూపిందని ఆరోపించారు.
గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా జిహెచ్ఎంసికి నిధులను కేటాయించి ఆదుకున్న చరిత్ర ఉందన్నారు .
మేయర్ కనీసం కౌన్సిల్ సమావేశం కూడా ఏర్పాటు చేసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
జిహెచ్ఎంసి బడ్జెట్లో అంకెల గారడీ తప్ప అభివృద్ధికి నిధులు మాత్రం కనిపించడం లేదని దుయ్యబట్టారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ కార్పొరేటర్లు మందముల రజితపరమేశ్వర్ రెడ్డి ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ,బొంతు శ్రీదేవి ,విజయారెడ్డి ,స్వర్ణరాజ్ శివమణి ఎస్ .ఎన్ రెడ్డి ,జగదీష్ గౌడ్ ,తదితరులు పాల్గొన్నారు.