Revanth Reddy’s Narsampet Visit Preparations
సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలి
సర్పంచ్ అభ్యర్థుల గెలుపుకు యూత్ కాంగ్రెస్ కృషి చేయాలి
యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్
నర్సంపేట,నేటిధాత్రి:
ఈనెల 5న నర్సంపేటలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు యూత్ కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ అన్నారు.నర్సంపేట స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన యుత్ కాంగ్రెస్ సమావేశంలో తుమ్మలపెల్లి సందీప్ మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యా,వైద్యం, రోడ్లు,త్రాగునీరు,సాగునీరు పలు ప్రభుత్వ రంగసంస్థల భవనాల నిర్మాణాలను చేపట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సీఎంతో ఒప్పించి నియోజకవర్గ అభివృద్ధికీ 1000 కోట్ల నిధులను తీసుకచ్చారని పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటి సభను విజయవంతం చేయాలని యూత్ కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు.నియోజకవర్గంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు యూత్ కాంగ్రెస్ నాయకులు కృషిచేసి రాష్ట్రంలోనే అత్యధిక సర్పంచ్ స్థానాలను మన నియోజకవర్గంలో గెలిపించుకొని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గౌరవ ప్రతిష్టలు చాటే బాధ్యత ప్రతి యూత్ కాంగ్రెస్ నాయకుడిపై ఉందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లగౌడ్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రూపిక శ్రావణ్ కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పల్స ప్రశాంత్ గౌడ్, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్కే షఫిక్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, చెన్నారావుపేట మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద నరేష్, ఖానాపూర్ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొల్లం హరీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు గద్ద అఖిల్, మహమ్మద్ సల్మాన్, దేశి సాయి పటేల్, మచ్చకంటి మనోజ్ కుమార్, మంచాల హరీష్, గద్ద నిఖిల్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.
