రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొక్కెరకుంట, గౌండ్లపల్లి, రుద్రారం, రంగసాయిపల్లి, దత్తోజిపేట, లక్ష్మీపూర్, వెంకట్రావుపల్లి, గుండి గ్రామాల్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా మహిళలలతో తన సంతోషాన్ని పంచుకున్న చోప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈసందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని, తెలంగాణ రాష్ట్రంలోని మహిళల కళ్ళల్లో సంతోషాన్ని చూడడానికే ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని తీసుకువచ్చిందని, గతంలో రామడుగు మండలంలోని ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని, ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు గెలిచిన వారం రోజుల్లోనే ఆర్టీసీ బస్సును వేయించామని, అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారెంటీలను అమలు చేసిన గొప్ప నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని, మహిళలు మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొమ్మరవేణి తిరుపతి, కొల రమేష్, జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కర్రసత్య ప్రసన్న, జిల్లా బిసిసెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులుగౌడ్, ఎంపిటిసి సభ్యులు జ్యావాజి హరీష్, సర్పంచ్ లు సాదు పద్మ, బండ అజయ్, శేఖర్, ప్రభాకర్, ఉప్పుల అంజన్ ప్రసాద్, కాడే శంకర్, సుధాకర్, కంకణాల శ్రీనివాస్, తడగొండ హన్మంతు, నర్సింగ్ బాబు, యమ కిశోర్, తదితరులు పాల్గొన్నారు.