కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఏపీ జితేందర్ రెడ్డి ఇంట్లో చర్చలు.
తగ్గిన హోదా కల్పిస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు సమాచారం.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లాలో బిజెపి తరఫున ఎంపీ టికెట్ బరిలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బిజెపి మహిళా జాతీయ అధ్యక్షురాలు డీకే అరుణ, బిజెపి రాష్ట్ర కోశాధికారి బండారి శాంత కుమార్, ముగ్గురు మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానాన్నీ ఆశించారు. ఎవరు ఊహించని రీతిలో బిజెపి అధిష్టానం మాత్రం జాతీయ మహిళా అధ్యక్షురాలు డీకే అరుణకు మహబూబ్ నగర్ ఎంపీ కేటాయించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బీసీలు బండారి శాంత కుమార్ ను కలవడానికి సిద్ధమైనట్లు విశ్వాసనీయ సమాచారం. అయితే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి బండారి శాంత కుమార్ ముందుకు వస్తారా !? లేక పార్టీ అధిష్టానం మేరకు బిజెపిలోనే కొనసాగుతారా అనే చర్చ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల్లో చర్చనీయమైంది. అయితే మహబూబ్ నగర్ మాజీ ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి ఇంటికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం రోజు మధ్యాహ్నం వెళ్లారు. ఏపీ జితేందర్ రెడ్డి తనకు ఈసారి తప్పక టికెట్ వస్తుంది అన్న నమ్మకంతో ఉన్నా చివరికి నిరాశే మిగిలింది. ఈ క్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరపడం రాజకీయంగా సంచలనం రేపుతుంది. ఏపీ జితేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని, వస్తే ఆయనకు తగ్గిన ప్రాధాన్యత ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి,హామీ ఇచ్చినట్లు సమాచారం. బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి పార్టీ మారుతారా!? లేక బిజెపిలోనే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో సంబంధాలు కొనసాగిస్తారా? లేక సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీతో పార్టీ మారుతారా అన్న అంశం ఈ చర్చల తర్వాత ఓ కొల్లక్కి రానుంది.