సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణి
సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):
సిరిసిల్ల పట్టణం అనంత నగర్ 26వ వార్డులో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. వికృతి భరత్ కుమార్ కి 42500 రూపాయల చెక్ ను అందజేయడం జరిగింది. వారి కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, మంత్రి పొన్నం ప్రభాకర్ కి, ఆది శ్రీనివాస్ కి, నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రెడ్దిమల్ల భాను, వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జయలక్ష్మి, దళిత నాయకులు కొంపెల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.