
కరీంనగర్, నేటిధాత్రి:
మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్న నిరుపేదలందరికీ సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా ఆర్థిక సాయం అందించడం కోసం స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ సహకారంతో చింతకుంటలో దాదాపు ఐదు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశాలు మేరకు మాజీ కొత్తపెల్లి మండల వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతినాయక్, జిట్టవేణి లాస్య నరేష్ ఇంటికి వెళ్లి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈసందర్భంగా భూక్యా తిరుపతి నాయక్ మాట్లాడుతూ పేద ప్రజలు అనారోగ్యానికి గురై వైద్యం కోసం అనేక కష్టాలు పడి అప్పులు చేసి తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్లి వైద్యం చేయించుకుంటే ఆర్థిక పరిస్థితి ఏర్పడి అనేక ఇబ్బందులు అవుతున్న సందర్భంగా ప్రభుత్వమే వైద్యానికి అయిన ఖర్చులకు గాను కొంత సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని అందులో భాగంగానే చింతకుంట గ్రామానికి మంజూరు కావడం జరిగిందని దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, స్థానిక మాజీ మంత్రి గంగుల కమలాకర్ కి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి చింతకుంట గ్రామ ప్రజల వైపున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈచెక్కుల పంపిణీ కార్యక్రమంలో టిఆర్ఎస్ కొత్తపల్లి మండల యూత్ అధ్యక్షులు గుర్రాల జయప్రకాశ్ రెడ్డి, నాయకులు చిన్న రాజు, సన్నీ, తదితరులు పాల్గొన్నారు.