మంథని భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పుట్ట మధూకర్‌ కు బీ-ఫామ్ అందించిన సీఎం కేసీఆర్‌

 

మంథని :- నేటి ధాత్రి

బీఆర్‌ఎస్‌పార్టీ జాతీయ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌ మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ కు బీ- ఫామ్ అందజేశారు. హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పుట్ట మధూకర్‌ కు ఆయన బీ-ఫామ్ అందజేశారు. గత నెలలో మంథని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పుట్ట మధూకర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ఎమ్మెల్యే అభ్యర్థిగా బీ-ఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ తనపై నమ్మంకం తో మూడోసారి పార్టీ భీ-ఫామ్ అందించిన సీఎం కేసిఆర్ కి మరియు సహకరించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కి హృయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!