బిఆర్ఎస్ మాజీ సర్పంచ్లకు భయపడుతున్న సిఎం
ముందస్తు అరెస్ట్ లను ఖండించిన మాజీ సర్పంచ్ విద్యాసాగర్
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రజా పరిపాలన వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ అసెంబ్లీ సమావేశాలలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజలను తప్పుదోవపట్టిస్తున్న సీఎం గత తాజా మాజీ సర్పంచుల పిండింగ్ బిల్లుల పట్ల బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్లు పోరాటం చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని తిమ్మంపేట మాజీ సర్పంచ్ మోడెం విద్యాసాగర్ గౌడ్ ఆరోపించారు.

తనతో పాటు నియోజకవర్గం పరిధిలోని దుగ్గొండి, నల్లబెల్లి, నెక్కొండ,ఖ నాపురం, నర్సంపేట మండలాల తాజా మాజీ సర్పంచులను ముందస్తుగా అరెస్టులు చేసి ఆయా పోలీసు స్టేషన్లో నిర్బందించడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు.అక్రమ అరెస్టులు నిలిపివేసి ఎన్నికల ముందు వాగ్దానం చేసిన పెడింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని విద్యాసాగర్ గౌడ్ డిమాండ్ చేశారు.