CM Cup Sports Torch Rally in Mahbubabad
ఘనంగా ‘సి.ఎం కప్’ క్రీడాజ్యోతి ర్యాలీ..
కొత్తగూడ, నేటిధాత్రి:
క్రీడాజ్యోతి అనేది క్రీడా కార్యక్రమానికి ఒక ఉత్సాహభరితమైన ప్రారంభాన్ని ఇచ్చే సంప్రదాయం, దీనిలో జ్యోతిని వెలిగించి, దానిని ర్యాలీ రూపంలో తీసుకెళ్తారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను గుర్తించి, వారి ప్రతిభను వెలికితీసి, వారికి మెరుగైన శిక్షణ అందించి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక కార్యక్రమం, దీని ద్వారా క్రీడలను ప్రోత్సహించి, అథ్లెట్ల సంఖ్యను పెంచి, పతకాలు సాధించేలా ప్రోత్సహించాలని తెలంగాణ క్రీడల విధానం సూచిస్తుంది, దీనిలో భాగంగానే తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ (SATG) ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి కలెక్టర్ గారు క్రీడాజ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం క్రీడాజ్యోతి ర్యాలీ బయ్యారం, గూడూరు నుండి కొత్తగూడ మండలంలో
ఎం ఈ వో ఆఫీస్ చేరుకుంది. తదుపరి డి.వై.ఎస్.ఓ డాక్టర్ జ్యోతి గారు క్రీడాజ్యోతిని ఎంపీడీవో దీపికకు అందజేశారు. అనంతరం క్రీడాజ్యోతిని తీసుకుని ర్యాలీగా కొత్తగూడ మెయిన్ రోడ్డు వరకు చేరుకొని కొత్తగూడ ఎం పి డి వో కార్యాలయం వైపుగా క్రీడాజ్యోతి కొనసాగింది. మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాలు జ్యోతి ర్యాలీగా వెళుతుంది. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజ్ కుమార్, ఎంఈఓ గుమ్మడి లక్ష్మీ నారాయణ, ఆశ్రమ స్కూల్ హెచ్ఎం ఆదిలక్ష్మీ, పిడీ వి. మాధవి, భూర్క నారాయణ, తదితరులు పాల్గొన్నారు
