జైపూర్,నేటి ధాత్రి:
బుధవారం రోజున తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకముగా నిర్వహిస్తున్న తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ,జైపూర్ మండల స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో సీఎం కప్ 2024 మండల స్థాయి క్రీడా పోటీలను జైపూర్ గ్రామ పంచాయతీ లోనీ టీఎస్ డబ్ల్యూ ఆర్ఈఎస్ స్కూల్ నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి.సత్యనారాయణ గౌడ్ ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 రోజుల వరకు గేమ్స్ నిర్వహించడం జరుగుతుందని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గెలిచిన వారికి బహుమతులు అందజేయడం జరుగుతుందనీ,విద్యార్థులు ఆటలను స్ఫూర్తి దాయకంగా తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సత్యనారాయణ గౌడ్, తహసీల్దార్ వనజా రెడ్డి,ఎస్సై శ్రీధర్,ఎంపీఓ శ్రీపతి బాపు రావు,ఎంఈఓ శ్రీనివాస్,ప్రిన్సిపాల్ నాగేశ్వర్ రావు,పంచాయితి కార్యదర్శి ఎ.సుమన్,బి.ఉదయ్ కుమార్,ఫిజికల్ డైరెక్టర్లు,పిటీలు,విద్యార్థులు పాల్గొన్నారు.