*రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలి.*
*నేడు, రేపు గ్రామస్థాయి పోటీలు.*
*ఎంపీడీవో విజయ్ కుమార్.*
*”నేటిధాత్రి” హనుమకొండ*
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న సీఎం కప్ ను విజయవంతం చేయాలని ఎలుకతుర్తి ఎంపీడీవో, సీఎం కప్ మండల ఇంచార్జ్ ఎన్. విజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఈ పోటీలను మూడు దశలుగా నిర్వహిస్తున్నారని తెలిపారు. మొదటి దశలో గ్రామస్థాయిలో ఆరు గేమ్ లు అనగా వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో, అథ్లెటిక్స్, ఫుట్ బాల్, యోగా క్రీడాంశంలో పోటీలు కం సెలక్షన్స్ ఈనెల 7, 8 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే మండల స్థాయి పోటీలు 10, 11 వ తేదీలలో నిర్వహిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఈనెల 16 నుంచి 21 తేదీ వరకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 36 క్రీడాంశంలో జిల్లాస్థాయిలో పోటీలు కం సెలక్షన్ నిర్వహించి రాష్ట్రస్థాయి జట్లను ఎంపిక చేస్తామని వివరించారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల వివరాలు సీఎం కప్ వెబ్ సైట్లో నమోదు చేసుకోవాలని తెలిపారు. క్రీడాకారుల ఈ పోటీలను విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ, మండల స్థాయి కమిటీలు వేశామని చెప్పారు. నేటి నుంచి జరిగే గ్రామస్థాయి పోటీల్లో ప్రతి ఒక్కరు పాల్గొని తమ ప్రతిభ చాటాలని చెప్పారు. ఇందులో ప్రతిభ చూపిన క్రీడాకారులను మండల స్థాయికి ఎంపిక చేస్తామని వివరించారు. ఈనెల 10, 11 తేదీల్లో ఎల్కతుర్తి లోని కార్మెల్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. అనంతరం ఎలకర్తి ఎంఈఓ సిహెచ్. సత్యనారాయణ మాట్లాడుతూ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఔత్సాయిక క్రీడాకాలను వెలుగులో తీసుకోవచ్చేందుకు శని, ఆదివారంలో గ్రామస్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. గ్రామస్థాయిలో విలేజ్ పంచాయతీ సెక్రెటరీ, పాఠశాల హెచ్ఎం సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పోటీలు పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అనంతరం నేటి నుంచి ఎలకతుర్తిలోని కార్మెల్ పాఠశాలలో జరిగే గ్రామస్థాయి పోటీల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ అబ్జర్వర్ పెరుమాండ్ల వెంకట్, పంచాయతీ సెక్రెటరీ శ్రీను, పీఈటీ లు రాముడు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.