CM Cup to Inspire Youth Confidence
యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచాలనే సంకల్పంతో సీఎం కప్
– భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండలో క్రీడల ద్వారా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంచాలనే సంకల్పంతో సీఎం కప్ 2025 – 26 ఏర్పాటు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈరోజు భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే జీఎస్సార్ సీఎం కప్ క్రీడాజ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించి, విద్యార్థులతో కలిసి కొద్దిదూరం ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గ్రామాల్లో ప్రతి క్రీడాకారుడిని రాష్ట్రస్థాయి వేదిక వరకు తీసుకెళ్లడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎంకు ద్వారా క్రీడలను జీవితంగా మార్చుకునే అవకాశాన్ని యువతకు అందిస్తామన్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతిభ ఉన్న క్రీడాకారుల భవిష్యత్తు వృధా కాకూడదని, యువత క్రీడల్లో ముందుకు రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
