Big Relief for Bangladesh Ahead of T20 World Cup 2026
కేంద్ర మంత్రి సీఆర్‌పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. పోలవరంపై ప్రధానంగా చర్చ..
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చ జరిగింది..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో (Union Minister CR Patil) సీఎం సమావేశమయ్యారు. ఏపీలోని వివిధ సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, ఆర్థిక సాయం, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, తాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమని సీఎం వివరించారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సాయంపై పెండింగ్‌లో ఉన్న అంశాలతో పాటు, అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపైనా సవివరంగా చర్చించారు ముఖ్యమంత్రి.
