ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
శాయంపేట నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో ఐదు రోజులపాటు ప్రజలు అధి కారులు పాల్గొని విజయవంతం చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు అన్నారు. ఈరోజు ఉదయం భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట మండల కేంద్రంలో నిర్వహిం చిన స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ముందుగామండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగాణంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులతో కలిసి మొక్కలను నాటారు. అనం తరం శాయంపేట లోని అంబేద్కర్ సెంటర్లో తెలంగాణ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. అనంతరం అక్కడ కొద్దిసేపు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చీపురు చేతపట్టి రోడ్డుపై ఉన్న చెత్తను శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. స్వచ్చమైన పర్యావరణాన్ని యథావిధిగా ముందు తరాలకు అందించాలని అన్నారు. పచ్చదనం పరిశుభ్రత తో గ్రామాలు విరాజిల్లినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యవంతమైన గ్రామాలను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.