చందుర్తి, నేటిదాత్రి:
ఈనెల 22 జనవరి 2024, సోమవారం రోజున అయోధ్య రామ మందిరం లో జరిగే బాల రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సూచన ప్రకారం గ్రామ గ్రామాన దేవాలయాల పరిశుభ్రత లో భాగంగా ఈరోజు చందుర్తీ మండల కేంద్రం లో శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చందుర్తీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక హనుమాన్, నాయకురాలు ,బేతాళ,ఎల్లమ్మ,మార్కండేయ,మడలేశ్వర్,పోచమ్మ,బీరప్ప, సౌడలమ్మ,సాయిబాబా,సారగమ్మ,మహాలక్ష్మి ఆలయాలను శుద్ధి చేయడం జరిగింది.. ఈ కార్యక్రమం లో శ్రీరామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మండల శాఖ ప్రముఖ్ లక్కర్సు శశికుమార్,సర్పంచ్ సిరికొండ ప్రేమలత శ్రీనివాస్,ఉపసర్పంచ్ చిర్రం తిరుపతి మాట్లాడుతూ 22 వతేది సోమవారం రోజున స్థానిక మార్కండేయ దేవాలయం లో ఉదయం 10గంటల నుండి ప్రత్యేక పూజలు,భజన కార్యక్రమాలు,హనుమాన్ చాలీసా పారాయణము,రామ మంత్ర జపము,అయోధ్య రామ మందిర లో జరిగే ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష లైవ్ ప్రసారం ఉంటుంది,అదేరోజు సాయంత్రం 6 గంటలకి 500 సంవత్సరాల హిందువుల పోరాటం నెరవేరిన సందర్భంగా ప్రతి ఇంటిదగ్గర 5 రామ జ్యోతి దీపాలను వెలిగించాలి అని కోరారు.. ఈ కార్యక్రమం లో ట్రస్ట్ సభ్యులు అత్తేన మహేందర్,చిలుక రాము,గణేష్,సాగర్,చరణ్ పాల్గొన్నారు.