రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ టవర్ నుండి తాళ్లల్లోకి వెళ్లే రహదారి వైపు ఉన్న కాలనీలోని మురికి కాలువలు గత మూడు సంవత్సరాల నుండి శుభ్రం చేయడం లేదని, దుర్గంధం వెదజల్లుతున్నాయని, దోమల బెడద ఎక్కువగా ఉందని మీమే మురికి కాలువలను శుభ్రంచేసుకుంటున్నామని స్థానికులు తమగోడును వెళ్లబోసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని పోచమ్మ వాడ నుంచి వచ్చే మురుగు నీరు ఇక్కడి వరకు తరలివస్తాయని మూడు సంవత్సరాల నుండి తమ ఇంటి ముందు ఉన్న మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో మురికినీరు నిల్వ ఉండడం వల్ల దుర్గంధం వెదజల్లుతు, దోమలతో సహవాసం చేసి వ్యాదులకు గురవుతున్నామని వాపోయారు. గతంలో ఉన్న సర్పంచ్, ప్రస్తుతం ఉన్న అధికారులుగాని మమ్ములను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తంచేశారు. కనీసం ఇప్పటికయినా సంబందిత అధికారులు స్పందించి మురికి కాలువలను శుభ్రం చేసి, మురుగునీరు నిల్వ ఉంచకుండా, దోమలను బెడదను నివారించాలని కాలనీ వాసులు కోరుతున్నారు.