మారుమూల ప్రాంతాల్లో కూడా అందుబాటులోకి మెడికల్ విద్యా
మహబూబాబాద్ అభివృద్ధికి నిరంతర పోరాటం
– శాసన సభ్యులు బానోత్ శంకర్ నాయక్
మహబూబాబాద్,నేటిధాత్రి:
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మించిన మెడికల్ కళాశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి గాను మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం అయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బానోత్ శంకర్ నాయక్ హాజరయ్యి విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా మారుమూల జిల్లా అయినా ఈ జిల్లాలో పేదలు అయ్యుండి మెడిసిన్ లాంటి ఉన్నత విద్య చదువుకోవాలనే కోరిక ఉన్న విద్యార్థులకు ఈ కళాశాల ఏర్పాటుతో అందుబాటులోకి ఉన్నత విద్య చదివే అవకాశం వచ్చిందన్నారు.ఈ సదవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు.విద్యార్థులు తమ తల్లిదండ్రులు కన్న కలలను నెరవేర్చాలని అలాగే వారు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకొని సమాజంలో మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.రామ్మోహన్ రెడ్డి,వైస్ చైర్మన్ ఎండి ఫరీద్,ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు,హెచ్.ఓ.డి డా.సీతామహాలక్ష్మీ,డిప్యూటీ సూపరింటెండెంట్ డా.వెంకట్,లెక్చరర్లు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.